వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమిని ఓజ్జల లావణ్య భర్త ఓజ్జల రాములు జిల్లా ఎస్పీ మహేష్ బీగితే సమక్షంలో సరేండర్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామానికి చెందిన ఓజ్జల లావణ్య భర్త ఓజ్జల రాములు సర్వే నంబర్ 61/47లో గల 4 ఎకరాల 2 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా చేసుకుని.. సాగు చేసుకుంటున్నాడని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ వివరించారు.
జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే.. సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని, పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ వెల్లడించారు.