వేద న్యూస్, వరంగల్:

హన్మకొండ జిల్లా దామెర మండలంలో  గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. మండల పరిధిలోని మొత్తం 132 వార్డులలో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరములు, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రచురణ చేపట్టినట్టు మండల పంచాయతీ అధికారి కేవీ రంగాచారి తెలిపారు. ఒగ్లాపూర్ జీపీ ఆఫీసులో గ్రామ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు డిస్ ప్లే బోర్డులో ప్రదర్శనకు అతికించినట్టు సెక్రెటరీ ఇంజపెల్లి నరేశ్ వెల్లడించారు.