• విధుల్లో చేరిన గ్రామ పాలన అధికారులు

వేద న్యూస్,శాయంపేట:

ప్రజా ప్రభుత్వం గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా జీపీవోలను తీసుకొచ్చింది.  శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గ్రామ పాలనాధికారులు (జీపీవో) జిల్లా కలెక్టర్ శాయంపేట మండలం లో ఉన్న పదమూడు రెవెన్యూ గ్రామాలకు పది క్లస్టర్ గా చేసి ఒక్కొక్క క్లస్టర్ కు ఒక్కొక్క గ్రామ పాలన అధికారి నీ నియమిస్తూ కలెక్టర్ నియామక పత్రాలను అందజేశారు.

ఇందులో భాగంగా శుక్రవారం పదిమంది గ్రామ పాలన అధికారులు శాయంపేట కార్యాలయంలో తహసిల్దార్ సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చి విధుల్లో చేరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, డిటి ప్రభావతి, ఆర్ ఐ లు డి రమేష్, ఏం రమేష్ లు పాల్గొన్నారు.