వేద న్యూస్, నల్లబెల్లి :

నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో గురుపూజోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నాగరాజు పల్లి, మామిండ్ల వీరయ్య పల్లి గ్రామాల మాజీ సర్పంచులు గోనే శ్రీదేవి, ఆసం చంద్రమౌళి ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సందర్భంగా వారు మాట్లాడుతూ పంతులుపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషిని అంకిత భావాన్ని అభినందించారు. విద్యార్థులు లేక మూతబడి పోయే ప్రమాద స్థితిలో ఉన్న పాఠశాలను ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి, గ్రామస్తులను ఒప్పించి ప్రైవేట్ స్కూళ్లకి వెళ్లే విద్యార్థులను కూడా తమ పాఠశాలకు రప్పించుకుని.. విద్యార్థులు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

మున్ముందు ఇంకా మంచి పేరు తెచ్చుకొని మండలంలోని పలు పాఠశాలలకు ఆదర్శవంతంగా తయారు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రామ్మూర్తి, ఉపాధ్యాయుడు కూనమల్ల రాజన్ బాబు, మామిండ్ల వీరయ్య పల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అమ్మోజు రాము గార్లను పూలమాలతో సత్కరించి శాలువాతో సన్మానించారు.

కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎరుకల వెంకటలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు నేతునూరి సుమలత, బైరి రమ, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.