• యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జు ఆధ్వర్యంలో వేడుకలు

వేద న్యూస్, జమ్మికుంట:
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు ఆద్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి తరాల మార్గదర్శకులు, భారత దేశాన్ని భావి తరాలవైపు నడిపించే ప్రజా నాయకుడు, జన హృదయనేత,భావి భారత ప్రధాని, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనుమడు, భారత్ జోడో, భారత్ న్యాయ్ యాత్ర ద్వారా దేశంలో గల ప్రతి ఒక్కరికీ మార్గదర్శిగా నిలిచిన మృదు స్వభావి, సౌమ్యుడు రాహుల్‌గాంధీ అని కొనియాడారు.

కేక్ కట్ చేసి పండ్లు, స్వీట్ల పంపిణీ కార్యక్రమంతోపాటు స్పందన బ్లడ్ బ్యాంక్ లో 10మంది రాహుల్ అభిమానులు రక్తం దానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి రమేష్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, గూడెపు సారంగపాణి, దొడ్డే నవీన్ తదితరులు పాల్గొన్నారు.