వేద న్యూస్, జమ్మికుంట:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న(గురువారం) జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా వైద్య నిపుణులు డాక్టర్ అనిత (ఎంఎస్ జనరల్ సర్జన్), డాక్టర్ ప్రణీత (ఎంఎస్ ఓబీజీ గైనకాలజిస్ట్) క్యాంపులో అందుబాటులో ఉంటారు. మహిళలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాంపులో పాల్గొనాలని నిర్వాహకులు సోమవారం కోరారు.