వేద న్యూస్, జమ్మికుంట:
పాతికేండ్ల లోపు వారితో పాటు పెద్దలు సైతం ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్నారు. చెన్నయ్‌లో గుండెకు సంబంధించి అనారోగ్యంపై వైద్యం చేసే కార్డియాలజీ వైద్యుడు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. మొత్తంగా హార్ట్ ఎటాక్ ప్రస్తుతం జనాలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో అసలు గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఏవైనా అనుమానాలు ఉంటే ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాలి? గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ఎలాంటి లైఫ్ స్టయిల్(జీవనశైలి) అనుసరించాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ హుజూరాబాద్ జమ్మికుంట శాఖ ప్రధాన కార్యదర్శి, జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు. ఆ ముఖ్యమైన విషయాలను ఇక్కడ చదివి మీరూ తెలుసుకోండి..

ప్రస్తుతం 30 ఏళ్ల లోపు యువతలో కూడా హార్ట్ అటాక్ (గుండెపోటు) ఎక్కువవుతోంది. దీని వెనుక ప్రధాన కారణాలు స్ట్రెస్, జంక్ ఫుడ్, పొగ త్రాగడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి. హార్ట్ అటాక్ ప్రివెన్షన్ కోసం అవసరమైన టెస్టులను ప్రతీ ఒక్కరూ 30 ఏళ్లు దాటకముందే చేయించుకోవడం మంచిది, ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్లు తప్పనిసరిగా చేసుకుంటే మంచిది.
బీపీ, షుగర్ టెస్ట్- హై బీపీ, డయాబెటిస్ ఉంటే హార్ట్ రిస్క్ పెరుగుతుందని గుర్తించాలి. లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ టెస్ట్) – చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువైతే రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. కాబట్టి చేయించుకుంటే బెటర్. ఈసీజీ/టీఎంటీ(స్ట్రెస్ టెస్ట్)..ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ఈ టెస్టు చేసుకోవాలి. ఎకోకార్డియోగ్రామ్(2డీ ఎకో)-ఇది గుండె పనితీరును చెక్ చేస్తుంది. సీఆర్‌పీ(కార్డియాక్ రిస్క్ మార్కర్ టెస్ట్) ఇన్‌ఫ్లమేషన్, హార్ట్ రిస్క్‌ను ఈ టెస్టు అంచనా వేస్తుంది.
ఈ జీవనశైలితో మీ గుండెకు ఆరోగ్యం
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్‌ను చాలా మంది ఎంచుకోవడం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మాత్రమే ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని గుర్తించాలని డాక్టర్ సురేశ్ ఊడుగుల సూచించారు.
ప్రతి రోజూ కనీసం 30–45 నిమిషాలు వాకింగ్/జాగింగ్/యోగ/జిమ్ చేయాలి. జంక్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తగ్గించుకోవాలి (ఉదాహరణ: బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి.). ఆహారంగా పండ్లు, కూరగాయలు, గింజలు (నట్స్), గ్రీన్ లీవ్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పొగ తారాగడం, మద్యం మానేయాలి – ఇవి డైరెక్ట్‌గా హార్ట్‌ను దెబ్బతీస్తాయి.. కాబట్టి ఈ సంగతి గుర్తెరిగి జాగ్రత్త వహించాలి.
తగినంత నిద్ర (7–8 గంటలు ) అత్యవసరం. నిద్రలేమి హార్ట్ రిస్క్ పెంచుతుంది. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం ధ్యానం, ప్రాణాయామం చేయాలి. ఎవరికి వారు తమ హాబీలు ఫాలో అవ్వాలి. నీరు ఎక్కువ తాగాలి. డీహైడ్రేషన్ కూడా బ్లడ్ ప్రెజర్ పెంచుతుంది. రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్టులు, హెల్త్ చెకప్ చేయించుకోవాలి.
ముఖ్యంగా హుజురాబాద్ వంటి సెమీ అర్బన్ ఏరియాల్లో కూడా జంక్ ఫుడ్ అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల కాన్షియస్‌నెస్(స్పృహ) కలిగి ఉండి.. హెల్త్, లైఫ్ స్టయిల్ పై శ్రద్ధ వహించాలి. ప్రివెన్షన్ మాత్రమే హార్ట్ ఎటాక్ తగ్గించే మెయిన్ మార్గం అని తెలుసుకోవాలి.