- ప్రజా సేవ కల నెరవేరకముందే కన్నుమూత
వేద న్యూస్,వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం,చింతల్ టాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో కన్నుమూశారు.
ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంత ఉత్సాహంగా నిన్నటి వరకు ప్రచారం నిర్వహించిన చెర్ల మురళి, గ్రామస్తులకు ప్రజాసేవ చేసేందుకు ఎన్నో కళలు కన్నారు.
గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.