వేద న్యూస్, చొప్పదండి:
చొప్పదండి మండలానికి చెందిన గుండేటి విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అసోసియేషన్ సభ్యులు రూ.5,500 నగదు సాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వారి బాధలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ యువకుడు అకాల మరణం చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. కుటుంబానికి కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.