వేదన్యూస్ – ముంబై
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా కౌంటరిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల భూమిని కాపాడుకోవడానికి యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరటానికి సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మద్ధతుగా నిలిచిన సంగతి తెల్సిందే.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ దియా మీర్జా తన ఎక్స్ లో యూనివర్సిటీలో జేసీబీలతో చెట్లను మొక్కలను కొట్టేస్తున్న వీడియోలను.. ఫోటోలను పోస్టు చేస్తూ అటవీ ప్రాంతాన్ని కాపాడండి. వన్య ప్రాణులను రక్షించండి అంటూ విద్యార్థుల పోరాటానికి మద్ధతుగా ఆమె పోస్టు చేశారు. సోషల్ మీడియాలో హెచ్ సీయూ భూముల గురించి ఏఐ ఆధారిత కంటెంటు.. వీడియోను పోస్టు చేశారని నటి దియా మీర్జాతో సహా పలువురిపై ప్రభుత్వం కేసులు పెట్టింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ఏకంగా సెలబ్రేటీలు అయితే కనీసం పరిజ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారని విమర్శించారు. ఈ విమర్శలపై నటి దియా మీర్జా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం అన్ని తెలుసుకోని మాట్లాడాలి. నేను ఏఐ ఆధారిత కంటెంటు పెట్టలేదు. యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలపైనే ఉన్నది ఉన్నట్లు పెట్టాను. ఏదైన మాట్లాడే ముందు అన్ని తెలుసుకోని మాట్లాడాలని సూచించారు.