Renu Desai

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న ప్రముఖ ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోకపోవడానికి వెనక ఉన్న కారణాన్ని  ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ వివరించారు.

ఈ సందర్భంగా రేణూ దేశాయ్ మాట్లాడుతూ పవన్ కళ్యాన్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత నాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అన్పించిన కానీ పిల్లల గురించి చేసుకోలేదని ఆమె కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.  నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను.

ఎంగేజ్మెంట్ సైతం చేసుకున్నాను. కానీ అటు వైపు నుండి బంధుత్వానికి ఇటు వైపు పిల్లలకు న్యాయం చేయలేనేమో అని అన్పించింది. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం పదిహేను ఏండ్లు. బహుషా  పాపకు పద్దెనిమిది ఏండ్లు వచ్చాక మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తానేమో అని మళ్లీ బాంబు పేల్చారు.