వేదన్యూస్ – సినిమా
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ , ప్రముఖ గాయని సైందవి ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి మనకు తెల్సిందే. అయితే వీరిద్దరూ గొడవపడటానికి.. ఆ గొడవ కాస్తా విడాకులకు దారీ తీయడానికి.. విడిపోవడానికి ప్రముఖ హీరోయిన్ దివ్య భారతి కారణం అని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు వీరిద్దరూ ఎప్పటి నుండో డేటింగ్ లో ఉన్నారు.
ఈ విషయం సైంధవికి తెలియడంతోనే వాళ్ల కుటుంబలో మనస్పర్ధలు ఏర్పడి విడాకులకు దారి తీసిందని కూడా వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా దివ్య భారతి ఈ వార్తలపై ఘాటుగానే స్పందించారు. ఆమె స్పందిస్తూ ” నేను ఎవరితోనూ డేటింగ్ లో లేను.
మరి ముఖ్యంగా పెళ్లైన వాళ్లతో నేను అసలు డేటింగ్ లో ఉండాలని కోరుకోను. సంగీత దర్శకుడు జీవి ప్రకాశ్ తో నాకు ఎలాంటి అనుబంధం.. బంధం లేదు. అఖరికి మాకుటుంబానికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి బేస్ లెస్ వార్తలను ఎలా ప్రచారం చేస్తారో తెలియదు. ఇప్పటికైన ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె ఘాటుగా స్పందించారు.