వేద న్యూస్, కామారెడ్డి:
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు కామారెడ్డి డీఈవో బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్టు డీఈవో తన ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు.
