- ట్విట్టర్ వేదికగా ప్రక టన
వేద న్యూస్, డెస్క్ :
అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సంచలనం రేపే రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలు అభ్యర్ధుల జాబితాల్ని వరుసగా ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్.. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పార్టీ సోషల్ మీడియా భేటీలో వెల్లడించారు. అయితే ఇదే స్ధానంలో తాను కూడా పోటీకి సై అంటూ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాసేపటికే తాను కూడా అక్కడి నుంచి బరిలోకి దిగుతానంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేయడం సంచలనం రేపింది. ఇప్పుడు పవన్ కు పోటీగా వర్మ ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతాయరన్నది సస్పెన్స్ గా మారింది.