• బెండకాయ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన 

వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ:

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, యువత సాధికారత తీసుకురావాలని జన శంఖారావం పార్టీ ఉద్దేశమని ఆ పార్టీ అధ్యక్షుడు నరసింహ పేర్కొన్నారు. శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పారువెల్లి జీవన్ రావు ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రామగుండంలో స్పిన్నింగ్ మిల్ బంద్ కావడంతో స్థానిక మహిళలు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఉపాధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అంతర్గాం, పాలకుర్తి రెండు మండలాల మహిళలకు ఉపాధి కల్పించే విధంగా పారువేల్లి జీవన్ రావు కంపెనీలు తీసుకు వస్తారని అన్నారు.

పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. జనశంకారావం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సలహాలు చేస్తున్నామని చెప్పారు.రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం జీవన్ రావు కృషి చేస్తానని అన్నారు. ఎన్టిపిసి లో ఉద్యోగం చేస్తూ ఎన్నో ఎండ్లు గా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో తన వంతు పాత్ర కూడా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బెండకాయ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.