sri rama navami

యావత్ హిందూ లోకానికి అతిపెద్ద పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడి పుట్టిన రోజు… పెళ్ళి రోజు ఒక రోజే కావడం మరో విశేషం. ఈరోజు ప్రపంచమంతటా రామ నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ప్రపంచంలో ఉన్న హిందువులంతా శ్రీరాముడ్ని పూజించి ఆ దేవుడి ఆశీస్సులను అందుకోవాలని భక్తిశ్రద్ధలతో వేడుకలను జరుపుకుంటారు. అయితే శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుందని వేదపండితులు చెబుతున్నారు.

రాముడు మధ్యాహ్నాం సమయంలో జన్మించారు కాబట్టి ఆసమయంలో భక్తులు పూజలు చేస్తే మంచిది. అప్పుడు ఆ రాముడి దీవెనలు మెండుగా అందుతాయి. అదేవిధంగా శ్రీరామ రక్షను పఠించి చేతికి దారం కట్టుకుంటే అంతా మంచే జరుగుతుందని వేదపండితులు చెబుతారు. రామరక్షను పఠించడం వల్ల నాలుక తిరుగుతుంది. అంతేకాదు నక్షత్రం రూపంలో రాముడు భక్తులను రక్షిస్తాడు.

జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల నుండి కూడా రక్షిస్తుంది అంట. శ్రీరామ రక్ష ను పఠించినాక ఎరుపు పసుపు దారం తీసుకుని రామరక్షను చెప్పాలి. ఒకసారి చెప్పాక ఒక ముడి వేయాలి. ఆ తర్వాత రెండో సారి చెప్పి కొద్ది దూరం తర్వాత ఇంకో ముడి ఇలా పదకొండు సార్లు చెప్పి పదకొండు ముడులు వేయాలి. అలా ముడులు వేసిన దారాన్ని రాముడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత చేతి మణికట్టుకు కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుందని వేదపండితులు చెబుతుంటారు.