- ఉగ్ర దాడిని ఖండించిన ఐఎంఏ జమ్మికుంట, హుజూరాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు సుధాకర్, సెక్రెటరీ సురేశ్
- దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మూకశ్మీర్ పహెల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హుజురాబాద్,జమ్మికుంట బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ అంకం సుధాకర్,సెక్రె టరీ డాక్టర్ ఊడుగులసురేష్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అంకం సుధాకర్ మాట్లాడుతూ అభం శుభం తెలియని,విదేశీయులు, పర్యాటకులు మరణించడం దురదృష్టకరమని,భారత ప్రభుత్వం తక్షణమే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పహెల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.