వేద న్యూస్, మెట్‌పల్లి ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్ జన్మదినం సందర్భంగా.. బీసీ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ… చిన్నపిల్లల వైద్యులుగామెట్ పల్లి పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వరకు వైద్య సేవలు అందిస్తూ.. ప్రజల మన్ననలు పొందిన రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ గంగసాగర్.. మెట్ పల్లి వాస్తవ్యులు కావడం గర్వకారణం అని పేర్కొన్నారు. పేదలకు చక్కటి వైద్య సేవలు అందిస్తున్న గంగాసాగర్ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షులు దోమకొండ రమేష్,ముగ్ధం ప్రశాంత్ గౌడ్,కోరే రాజు,జిదుల సంతోష్,మజ్జు,కోయల్కర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
