వేద న్యూస్, నల్లబెల్లి:
ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొడుకు అక్రమాలపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని దళిత వృద్ధురాలు బస్టాండులో నిరసన కార్యక్రమం చేపట్టింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
తల్లి, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం .. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న లద్దునూరి యుగేందర్‌పై అతని తల్లి 70 ఏండ్ల లద్దునూరి సూరమ్మ పలు ఆరోపణలు చేశారు. యుగేందర్, తన భార్య పరిపూర్ణతో కలిసి పెన్షన్ పేరుతో భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని విమర్శించింది. తన హక్కులను కాపాడి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. దళిత వృద్ధురాలిగా తాను అన్యాయానికి గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
