– ప్రత్యేక పూజలు చేసిన అనితారెడ్డి
వేద న్యూస్, వరంగల్:
జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు గణేశ్ నిమజ్జన వేడుకలను బుధవారం మానసిక దివ్యాంగులతో కలిసి జరుపుకున్నారు. స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో గణేశుడి నవరాత్రులు పూజలు చేసి అందరూ బాగుండాలని కోరుకున్నారు. అనంతరం పిల్లలకు అన్నదానం నిర్వహించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. నిమజ్జనకు గణేష్ ప్రతిమను శోభయాత్రగా తరలిస్తున్న వేళ పిల్లలు చక్కగా డాన్స్ చేసి పాటలు పాడారు. ప్రసాదంగా పులిహోర, చక్కెర పొంగలి పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పండుగ వేడుక అంటే మన ఇంట్లో మనం చేసుకుని మనం సంతోషముగా గడపడం కాదని చెప్పారు. కల్మషము ఎరుగని ఈ పిల్లల మధ్య వేడుక జరుపుకుంటే ఆ సంతోషాన్ని పది మందికి పంచిన వారమవుతామని పేర్కొన్నారు. భగవంతుడు కూడా అదే ఇష్ట పడతారని ఇక్కడ జరిపానని స్పష్టం చేశారు. పిల్లల సంతోషాన్ని చూసాక తనకు ఓ అమ్మలా చాలా సంతృప్తి కలిగిందని వెల్లడించారు. పిల్లలతో, టీచర్స్, సిబ్బంది తో కలిసి భోజనము చేయడం తో వారు చాలా సంతోష పడ్డారని డాక్టర్ అనితా రెడ్డి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, సుచరిత, రాజేందర్ రెడ్డి, వసుధ, హరిత పాల్గొన్నారు.