వేద న్యూస్, డెస్క్ :
మేడారం జాతర పురస్కరించుకొని వివిధ ప్రాంతాల చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా పంచాయితీ రాజ్, గ్రామాభిృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ప్రత్యేక దృష్టి సారించారు. మేడారం లో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీల మ్యూజియం అవరణలో చేనేత వస్త్రాల కొనుగోలుశాల (స్టాల్స్) ఏర్పాట్లు చేశారు .
తెలంగాణ నుంచి నారాయణపేట, సిద్దిపేట, గద్వాల్, పోచంపల్లి, వరంగల్. ఆంధ్రప్రదేశ్ నుంచి దేవంగిరి, మంగళగిరి చీరల స్టాల్ల్స్ ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శన శాలలో గొల్లభామ, ఇక్కట్ చీరలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆ జాతరలో చేనేత వస్త్రాలు భక్తులను ఆకర్షించడంతో కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. వీటి ధరలు రూ.300 నుండి రూ.7,500 వరకు ఉన్నాయి. చేనేతలు కొనుగోలుశాల (స్తాల్స్) ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి రుసుము తీసుకోకుండా ప్రభుత్వమే తిరిగి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నారు .