వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట:
జమ్మికుంట కాంగ్రెస్ విజయభేరి సభలో ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ తల్లి పద్మశ్రీ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. సభలో పద్మశ్రీ మాట్లాడుతూ తన కొడుకును గెలిపించాలని, తాను గడప గడపకు తిరిగి మాత్రమే ప్రచారం చేశానని, సభకు హాజరైన జనాన్ని చూసి సంతోషంతో స్పీచ్ ఇస్తున్నట్లు తెలిపారు. తన కొడుక్కి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తనకు ఒక్కడే కొడుకు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ ఉన్నా తాను హుజురాబాద్ సింగాపురంలో ఉంటేనే తృప్తి ఉందని, ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వెళ్తానని ప్రణవ్ చెప్పగా, తాము ఒప్పుకున్నామని పద్మశ్రీ స్పష్టం చేశారు. అమెరికాలో చదువుకున్న తన తనయుడు ప్రణవ్ ప్రజాక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ప్రణవ్ తల్లి మాట్లాడున్నంతసేపు సభలో జనం నుంచి చక్కటి రెస్పాన్స్ రావడం సర్వత్రా చర్చనీయాంశంమయింది.