వేద న్యూస్, వరంగల్:

నెక్కొండ మండలం ఉమ్మడి చంద్రుగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు బక్కి నరేష్ మాట్లాడుతూ “గరీబీ హటావో “నినాదంతో భారతదేశంలో బ్యాంకులను జాతీయకరణం చేసి దేశ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తేవడంతో పాటు దేశవ్యాప్తంగా అనేక భూసంస్కరణ చట్టాలను తీసుకువచ్చి దళిత,గిరిజనులకు భూ పంపిణీ చేసి, దేశ అభివృద్ధి కోసం పరితపించి చివరికి దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అన్నారు.

కార్యక్రమంలో చంద్రుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోక అనిల్ ,మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్డే సురేష్, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిండ్ల మల్లారెడ్డి,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి రాజశేఖర్, బీసీ సెల్ మండల కార్యదర్శి, బత్తిని శ్రీధర్, గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు బోనగిరి శివ, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాంకాల మధుకర్, చిద్రబోయిన సమ్మయ్య ,సంగని బుచ్చయ్య,బాకీ మహేష్, పోనకంటి వెంకటస్వామి,బాకీ యాకయ్య, మాంకాల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.