వేద న్యూస్, నలగొండ ప్రత్యేక ప్రతినిధి :
ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పేరపాక మౌనిక సతీష్ అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేములపల్లి మండలం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.
పేదల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మండల పరిధిలోని ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ తమదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం సూచన మేరకు గడువులోపు పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, గ్రామపంచాయతీ కార్యదర్శి రామ్ రెడ్డి,గంట నాగయ్య,సబ్బు లింగారెడ్డి, చన్నబోయిన శ్రీను, గడ్డమీది గురుస్వామి, గంట నర్సయ్య, ముత్యాల కృష్ణయ్య, పేరాపాక సైదులు, విష్ణు, ముత్యాల వెంకటయ్య, జంగిలి సైదులు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.