వేద న్యూస్, ఇబ్రహీంపట్నం :
ఇబ్రహీంపట్నం మండలం గోదురు గ్రామంలో ఇల్లు ఉన్న వాళ్లకే ఇల్లు ఇచ్చారంటూ.. గోదురు గ్రామ వాసి గోపు లలిత అనే మహిళ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే గోదురు గ్రామంలో రాచకొండ సునీత అను వ్యక్తికి ఇంటి నెంబర్ 6-18 నెంబరు గల ఇల్లు ఇప్పటికే ఉందని, వారు అందులోనే నివాసం ఉంటున్నారనీ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం కేటాయించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోటలోని ఇందిరమ్మ ఇండ్లను ఒక బిఆర్ఎస్ నాయకుడు వారికి దగ్గరి బంధువు అని ఇల్లు ఉన్న వారికి ఇచ్చుకున్నారు అని సదరుఫిర్యాదు దారు వాపోతున్నారు.
గోదురు గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు, కిరాయికి నివాసం ఉంటున్నవారు చాలామంది ఉన్నారని ఇప్పటికే ఇల్లు ఉన్న రాచకొండ సునీతకు కేటాయించిన ఇందిరమ్మ ఇల్లును రద్దు చేసి ఇల్లు లేని వారికి ఇవ్వాల్సిందిగా గోపు లలిత అధికారులను కోరారు.