వేద న్యూస్, ఇల్లందకుంట:

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలె రామారావు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొ డి తల ప్రణవ్ కు వినతి పత్రం సమర్పించారు. 

కాంగ్రెస్ వాదిగా ఏండ్లుగా సేవలందిస్తున్న రామారావు

గత 22 ఏండ్లు గా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తనకు అధిష్టానం సమచిత స్థానం ఇవ్వాలని అభ్యర్థించారు.

హుజురాబాద్ నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నిక, సాధారణ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేసిన రామారావుకు సముచిత పదవి ఇవ్వాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.