వేద న్యూస్, సినిమా:
వెండితెరపై వినోదాన్ని పంచుతూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తూ.. ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ గా నిలిచే హీరోల్లో ఒకరు రవితేజ. అగ్రకథానాయకుల్లో ఒకరిగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మాస్ మహారాజ కష్టపడి పైకి వచ్చిన హీరో. సినిమా కష్టాలను అధిగమించి.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. శ్రమనే నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఆయన కొంత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాక నిర్మాతలు ఆయనతో సినిమాలు తీశారు. కాగా, రవితేజతో ఒకానొక సమయంలో ఓ నిర్మాత సినిమా తీయొద్దు.. హీరోను మార్చాలని డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను అడిగితే.. ప్రాజెక్టును డ్రాప్ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన హీరోకు మ్యానరిజమ్స్ ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో అందరికీ తెలుసు. కాగా, అప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బద్రి’, ‘బాచి’ సినిమాలు రాగా, తర్వాత సినిమాకు రవితేజను హీరోగా సెలక్ట్ చేసుకున్నారు. కానీ, నిర్మాత రవితేజ వద్దని చెప్పగా, ఆ ప్రాజెక్టును డ్రాప్ చేశారట పూరీ జగన్నాథ్. అయితే, తర్వాత వేరే నిర్మాతలు రవితేజతో చిత్రం చేయడానికి ముందుకు రాగా అలా తెరమీదకు వచ్చిన చిత్రమే ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’.