వేద న్యూస్, వరంగల్:

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డిని కోరారు.  హనుమకొండలోని ఆయన నివాసంలో ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి.. బ్రహ్మోత్సవాలకు మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.