వేద న్యూస్, వరంగల్:
ఈ నెల 26న మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జన శిక్షణ సంస్థాన్ వరంగల్ లబ్దిదారులు ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఖాజా మసియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. రచ్చ రజని, బోనాల రేణుక, మస్క దివ్య జేఎస్ఎస్ లో స్కిల్, వ్యాపార మెళకువలలో ట్రైనింగ్ పొంది చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వారికి రిపబ్లిక్ డే(గణతంత్ర దినోత్సవం)లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. వారు తమ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నడానికి కేంద్ర ప్రభుత్వం యెక్క పూర్తి ఖర్చుతో ఢిల్లీకి ప్రయాణించనున్నారు. కాగా, అరుదైన అవకాశం వారికి లభించినందుకు జన శిక్షణ సంస్థాన్ ప్రతినిధులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు.