YS JAGANMOHAN REDDY

వేదన్యూస్ – పెనుగొండ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రానికి ఓ పర్యాటక అతిథి మాత్రమే అని మంత్రి సవిత  అన్నారు. నిన్న మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో ఎన్టీఆర్ భరోసా ఆసరా పింఛన్ల కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ” పది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు పెడుతుంది.

అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ టూరిస్ట్ లాంటివారు అంటూ వ్యాఖ్యానించారు. పది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఎవరిపైన కక్ష్య పూరిత చర్యలకు పాల్పడలేదు. అక్రమ కేసులు పెట్టలేదు. ఏమున్న కానీ చట్టఫరంగా చర్యలు తీసుకుంటుంది తప్పా ఎవరిపైన వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడం లేదని ఆమె తెలిపారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” ఐదేండ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.

ఎక్కడక్కడికి దోచుకు తిన్నారు. ఐదేండ్లలో చేసిన అక్రమాలు.. అవినీతి ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తుంది. గతంలో తాము చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని కొంతమంది బాత్రూంలలో జారి పడుతున్నారు. మరికొంతమంది రాష్ట్రాలనే దాటిపోతున్నారు. అవినీతి అక్రమాలు చేసిన వారు ఎంతటివారైన సరే వాళ్లను చట్టం వదిలిపెట్టదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని హెచ్చారించారు.