వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.! జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అర్థరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దీక్షిత్ అనే కాంపాండర్ యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్టు సమాచారం.
చికిత్స కోసం వచ్చిన యువతి అఘాయిత్యానికి గురికావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతున్న ది.
బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి.. దిగిన పోలీసులు ఆసుపత్రి సీసీ పుటేజ్ ను సేకరించి ..యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేశారు.