వేద న్యూస్, వీర్నపల్లి:

అది మండల కేంద్రం.. నిత్యం ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతం లో తిరుగుతుంటారు. అలాంటే చోట సాయంత్రం 6 దాటితే చాలు.. చిమ్మ చీకటితో కండ్లు బైర్లు కమ్మేలా పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు వాపోతున్నారు. 

వీర్నపల్లి మండలకేంద్రంలో ఉన్న రహదారిలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని,. దాంతో సాయంత్రం పూట ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం వానాకాలం కావడంతో సాయంత్రం వేళన పాములు, తేళ్లు లాంటి విష పురుగులు బయటికి వస్తున్నాయని, అలాంటి రాత్రి సమయంలో వీధి దీపాలు కూడా వెలగకపోవడంతో ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే గ్రామ ప్రజలు జంకుతున్నారని వివరిస్తున్నారు. 

అధికారులకు తమ సమస్యలు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలో  వీధి దీపాలు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.