• రోడ్డు సరిచేయాలని భక్తుల విజ్ఞప్తి

వేద న్యూస్, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ రోడ్డు అధ్వానంగా మారింది. రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట మండలాల నుండి షాపింగ్, పండుగ పనుల కోసం వేములవాడకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వర్షంతో ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా కంకర, డస్ట్ వేసి పనికొచ్చినట్టుగా చూపిస్తున్నారని, తారు రోడ్డు నిర్మాణానికి నిధులు వచ్చాయని ప్రకటన చేసినా, ఇప్పటివరకు పనులు మొదలుపెట్టకపోవడం పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వెంటనే పనులు ప్రారంభించి వాహనదారులు, రాజన్న భక్తులకు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.