వేద న్యూస్, డెస్క్:

తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.తనను  తాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని, ఇంకోక్కరికి లోకసభ ఎన్నికలలో బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆమె తెలిపారు.

ఈడీ మంగళవారం కవితను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సందర్భంగా కవిత మాట్లాడారు.అలాగే,మూడో నిందితుడు కేసు నుంచి బయటపడేందుకు రూ. 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందజేశారని పేర్కొన్నారు.తనపై చట్టవిరుద్ధంగా తప్పుడు కేసు బనాయించారని,న్యాయపోరాటం చేసి కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తానని కవిత స్పష్టం చేశారు.