- ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
పండుగ అంటే పదిమంది సంతోషంగా కలిసి చేసుకునేదని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఎవన్గెలికల్ బాప్టిస్ట్ చెర్చ్ ,హన్మకొండలో నిర్వహించిన ప్రీ-క్రిస్టమస్ వాడుకలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని..కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ సమానత్వం, మానవత్వం, శాంతిమార్గము అనుసరించాలని, అసూయ, ద్వేషాలు వదిలి అందరికి ప్రేమను పంచాలని సూచించారు.
ఏ దేవుడు..ఏ మతం చెప్పినా అందరూ కలిసి మెలిసి ఉండాలని మంచిని అను సరించాలని, మానవత్వం, దయ, కరుణ చూపాలని చెబుతారని డాక్టర్ అనితా రెడ్డి వివరించారు. అనంతరం అతిథులు, చర్చ్ సంఘ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ చేసుకుని, ప్రార్థన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అనితా రెడ్డి ని ఘనంగా సన్మానించారు.

