• గ్రామస్తులతో కలిసి జమ్మి మొక్క నాటిన మాజీ సర్పంచ్ నందయ్య
  • బతుకమ్మ తెప్ప ఆవరణలో..

వేద న్యూస్,బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని బతుకమ్మ తెప్ప ఆవరణలో సోమవారం గ్రామస్థులతో కలిసి మాజీ సర్పంచ్ నందయ్య జమ్మి మొక్క నాటారు.

రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్చే పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వెంకట్రావుపల్లి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, దేవాలయలో పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో బతుకమ్మ తెప్ప వద్ద జమ్మి మొక్క నాటారు.

ఈ సందర్బంగా నందయ్య మాట్లాడుతూ బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామ ముద్దు బిడ్డ సంతోష్ కుమార్, ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేవ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర మంతా మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని .. వారు ఇప్పటికే కోట్ల మొక్కలు నాటి భావితరాలకు బాసటగా నిలుస్తున్నారని చెప్పారు.

అందులో భాగంగా దసరా దసరాకి జమ్మి మొక్క నాటాలని మన సంప్రదాయాన్ని కాపాడాలని, ఊరు ఊరున గుడి గుడికి జమ్మి మొక్క నాటాలని తెలిపారు. 

కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సాండేసారం రాజారాం, ఉపాధ్యక్షులు నల్లాల కమలాకర్, నర్సింగాపూర్ సొసైటీ వైస్ చైర్మన్ నల్లాల బాలరాజ్,మోకిడే హరీష్, కో ఆప్షన్ సభ్యుడు సావానపెల్లి నారాయణ, చెంచు ఎల్లారెడ్డి, తీర్తాల సదయ్య, పెంతల శివ, కొండ విక్కీ గౌడ్, జాల శివ, నల్లాల సత్తయ్య, గ్రామంలోని మహిళలు, పెద్దలు, పూజారి, యువకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.