వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లాలోని అతి పెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతున్న జమ్మికుంట బులియన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆకారపు రమేష్ ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా కట్టుకోజుల మహేందర్ కార్యవర్గ సభ్యులు ఆదివారం వినాయక గార్డెన్ లో జిల్లా బులియన్ అధ్యక్షుడు వంగల రమేష్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.
బుల్లియన్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం అందరి సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. నాపై నమ్మకంతో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ నా నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఉప్పుల భాస్కరాచారి, ఉపాధ్యక్షులు తేలుకుంట్ల తిరుపతి, కొదురుపాక హరిప్రసాద్, కాసుల శేషు, విజయగిరి సురేష్ కోశాధికారిగా చనుమల్ల సంజీవ్ కుమార్. సహాయ కార్యదర్షులు విజయగిరి శ్యాంసుందర్, విజేందర్ , ప్రచార కార్యదర్శులు కాసర్ల రవీంద్రచారి, ఎగ్గని శ్రీనివాస్, పున్నమాచారి, బస్సు చింటూ తదితరులు పాల్గొన్నారు.