• రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివకోటి యాదవ్
  • జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పుట్టిన రోజు వేడుకలు 

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
జనసేన పార్టీ నర్సంపేట మండల ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాజేందర్ పుట్టిన రోజు సందర్భంగా నర్సంపేట లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు వంగ మధు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సెలబ్రేషన్స్ కు నర్సంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జి మేరుగు శివకోటి యాదవ్ హాజరై రాజేందర్ ను శాలువాతో సన్మానించారు. ఓర్సుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజేందర్ జనసేన పార్టీకి చేస్తున్న సేవలను కొనియాడారు.

ఈ బర్త్ డే వేడుకల్లో జనసేన పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు వంగ మధు, ఉపాధ్యక్షులు కుండే రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొబ్బ పృథ్వీరాజ్, ఎలబోయిన డేవిడ్, కార్యదర్శులు రొడ్డ శ్రీకాంత్, పోశాల కార్తీక్, కొమ్ము రంజిత్, గద్దల కిరణ్, ఎలుక రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.