– ఆ పార్టీ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి శివకోటి యాదవ్
– పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం..క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
వేద న్యూస్, నెక్కొండ/నర్సంపేట:
దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జనసేన పార్టీ తన కార్యకర్తలకు అండగా రూ.5 లక్షల బీమా పార్టీ ఇస్తోందని ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు శివకోటి యాదవ్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు పని చేయాలని సూచించారు.
ఆదివారం నర్సంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ‘జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం-ఆత్మీయ సమావేశం’ నిర్వహించారు. ఈ సమావేశంలో శివ కోటి యాదవ్ మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా జనసేన పార్టీ పని చేస్తోందని చెప్పారు.
నర్సంపేట నియోజకవర్గంలో దాదాపు 300 మంది కార్యకర్తలు రూ.500 చెల్లించి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతీ ఒక్క కార్యకర్త నర్సంపేట నియోజవర్గంలో జనసేన పార్టీ జెండా ఎగురవేసేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.
ప్రతీ జనసేన పార్టీ కార్యకర్త భద్రత, భరోసా కోసం రూ.50 వేల ప్రమాద బీమా, రూ.5 లక్షల జీవిత బీమా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అందిస్తోన్నారని చెప్పారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు అందజేశారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు వంగ మధు, షేక్ హుస్సేన్, ఉడుగుల క్రాంతి, గంగుల రంజిత్, ప్రధాన కార్యదర్శులు ఓర్సు రాజేందర్, గాండ్ల అరుణ్, కార్యవర్గ సభ్యులు బొబ్బ పృథ్వీరాజ్, రొడ్డ శ్రీకాంత్, కొమ్ము రంజిత్, రాపోలు సురేష్, గద్దల కిరణ్, మిలాన్, లహరి, రణదీప్, సూర్య, రవి, భార్గవ, నితిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.