• ‘దానాపూర్’ ఎక్స్ ప్రెస్ జమ్మికుంటలో ఆగడం పట్ల సంతోషం 

వేద న్యూస్, జమ్మికుంట:

సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే ‘దానాపూర్-పాట్నా ఎక్స్ ప్రెస్’ బుధవారం నుంచి జమ్మికుంట రైల్వేస్టేషన్లో ఆపేందుకు కృషిచేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ఈ ప్రాంత ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంగళవారం జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి దూర ప్రాంతాలకు వెళ్లడానికి కొన్ని రైళ్లు ఆగేవి కాదని, బండి సంజయ్ కుమార్ కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడి జమ్మికుంట రైల్వే స్టేషన్లో దానాపూర్ ఎక్స్ ప్రెస్ ఆపేందుకు కృషి చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు.

ప్రజల పక్షాన కరీంనగర్ ఎంపీ తో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి కి వాసు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వేముల రాజశేఖర్ రెడ్డి, కొత్తగట్టు రాజేష్, మడిపల్లి అశోక్, మేకల రత్నం, సంగ పోచయ్య యాదవ్, మురహరి రాజు తదితరులు పాల్గొన్నారు.