• అన్ని ఫెసిలిటీస్, ఉన్నత విద్యనభ్యసించిన అధ్యాపకులున్నారు
  •  ఈ కాలేజీలో చేరి మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోండి
  •  విద్యార్థులకు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సూచన
  •  డిగ్రీ కాలేజీ అధ్యాపకుల అడ్మిషన్ల ప్రచారం..కాలేజీ ప్రిన్సిపాల్ అభినందన

వేద న్యూస్, జమ్మికుంట:

ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట అధ్యాపకులు కరపత్రాలు ద్వారా అడ్మిషన్ల ప్రచారం చేశారు. గురువారం అధ్యాపకులు విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేసి వారితో మాట్లాడారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంటలో అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు.

ఉన్నత విద్యను అభ్యసించిన అధ్యాపకులు కళాశాలలో ఉన్నందున ఈ కళాశాలలో చేరి మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కళాశాలలోని టీఎస్ కేసీ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. కళాశాలలో బిఏ హెచ్ ఇ పి, బి ఏ ఆఫీస్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, బిఎస్సి డైరీ, బిఎస్సి క్రాఫ్ ప్రొడక్షన్, బి ఎస్ సి బి జెడ్ సి, బి ఎస్ సి బి జెడ్ సి ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు దోస్త్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.

దోస్త్ అడ్మిషన్ల లిస్ట్ వచ్చిన తర్వాత తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి కళాశాలలో చేరాలని విద్యార్థులకు మార్గం నిర్దేశం చేశారు. కరపత్రాల ద్వారా అడ్మిషన్ల ప్రచారం చేసిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజశేఖర్ అభినందించారు. కార్యక్రమంలో దోస్త్ కళాశాల కోఆర్డినేటర్ వి. స్వరూప రాణి, కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. శ్రీలత అధ్యాపకులు డాక్టర్ బి. సువర్ణ, డాక్టర్ ఎంబడి రవి, ఎల్ .రవీందర్, పి. శ్రీనివాస్ రెడ్డి, పి. రవి ప్రకాష్, ఎన్. మమత, పి.సుష్మ, కె. సుధాకర్ , ప్రశాంత్, అరుణ్ రాజ్ పాల్గొన్నారు.