వేద న్యూస్, నెక్కొండ:

నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు.

పార్టీలో చేరిన వారిలో వేమ రమేష్, వనం రాజు, వనం పెంటయ్య, బొంత సారయ్య, బొంత సదన్న, పల్లకొండ చిన్న సారంగం, సుర ఐలయ్య తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారందరికీ మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి , నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భక్కి అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి శివకుమార్, మండల నాయకులు కుసుమ చెన్నకేశవులు, మండల అధ్యక్షులు మాదటి శ్రీనివాస్, మండల అధ్యక్షులు రావుల మహిపాల్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు మందుల కవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.