- సొంత గూటికి చేరిన నాయకులు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ:
నెక్కొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి దొంతి మాధవరెడ్డి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాధవరెడ్డి గారు మాట్లాడుతూ మాయమాటలు చెప్పి తొమ్మిది సంవత్సరాలు కాలం గడిపిన అధికార పార్టీకి నవంబర్ 30 వ తారీకు రోజున అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ప్రకటించిన ఆరోగ్యారెంటీలను వంద రోజులలో అమలు పరుస్తామని హామీనిచ్చారు.
నున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అధికార మార్పు తథ్యమన్నారు. ఎన్నికల కోడ్ పడిన తర్వాత కూడా అధికార పార్టీ నాయకులు గృహలక్ష్మి దళిత బంధు అంటూ ఇంకా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, ఎస్టి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు లవుడియ తిరుమల చౌహన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి శివకుమార్ , శ్రీనివాస్, తాళ్లపల్లి సాంబయ్య, రామడుగు రాజు , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.