- కమల దళంలో బొట్టుపల్లి గోపాల్ చేరిక
- ఆయన అనుచరులూ బీజేపీలో జాయిన్
- మోతుగూడ సర్పంచ్ గా గోపాల్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరిన మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు
వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి:
సర్పంచ్ ఎన్నికలలో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్, ఆసిఫాబాద్ మాజీ జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం మండలంలోని రాజుర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బొట్టుపల్లి గోపాల్ తన అనుచరులు, గ్రామస్తులతో కలిసి ఆరిగేల నాగేశ్వరరావు సమక్షంలో బిజెపిలోకి చేరారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన 200 మంది బీజేపీ లోకి చేరారు.
వీరికి అరిగేలా నాగేశ్వరరావు బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మోతుగూడ గ్రామ పంచాయతీలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్తి బొట్టుపల్లి గోపాల్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.
ఇది వరకు రాజుర లో బీజేపీ అనేక సమస్యలను పరిష్కరించిందని.. భవిష్యత్ లో కూడా సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగేలా మల్లికార్జున్, నాయకుడు ప్రసాద్, దీపక్, రాజుర గ్రామస్తులు సాంబయ్యా, గుణవంతురావు, రమేష్, మోహన్, శ్రీకాంత్, వసంత్ , ఆత్మరాం, మోహన్, మోతుగూడ గ్రామస్థులు గంగన్న, నగేష్, నరేష్, పవన్ లు తదితరులు ఉన్నారు.