వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్:
కమలాపూర్ మండలం మర్రిపల్లెగూడెంలోని గౌడ్‌లు మంగళవారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వారికి పాడి గులాబీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ..పేద ప్రజలకు శ్రీరామరక్షగా ఉందని అన్నారు.

గౌడన్నల కోసం బీమా పథకంతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా అందించింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. వైన్స్ టెండర్ లో కూడా గౌడ్లకు ప్రత్యేక కేటాయింపు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కేసీఆర్ కారణమయ్యాడున్నారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మాట్లాడి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టో అన్ని వర్గాల కోసం ఆలోచించి రూపొందించామని, దాంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తన సొంత మేనిఫెస్టో కూడా తయారు చేశానని వెల్లడించారు.

తనకు ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ నియోజకవర్గం మార్చి చూపిస్తానని అన్నారు. కొత్త మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేస్తూ సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి మహిళకు రూ.3,000 అందిస్తామన్నారు. దీంతోపాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతామని, ప్రతీ ఇంటికి ఉచితంగా ఐదు లక్షల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

ప్రజలంతా అండగా ఉండి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పులి నాగరాజు, సర్పంచ్ కిరణ్ మై విజయ్, మాజీ సర్పంచులు రమేష్, ఏకే, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు సత్యనారాయణ రావు, ఇంద్రసేనారెడ్డితో గౌడ్ లు పాల్గొన్నారు.