వేద న్యూస్, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి గులాబీ పార్టీ  అధినేత కేసీఆర్ తనయ కవిత రాజీనామా చేశారు.ఈ క్రమంలో ఆమెకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆఫర్ ఇచ్చారు. 

ఈ మేరకు కేఏపాల్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో తాజాగా కవిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బరిలో దిగాలని, ప్రజాశాంతి పార్టీ తరఫున మద్దతు ఇస్తామని కేఏపాల్ ప్రకటించారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో..