- శ్రీ రామలింగేశ్వర దేవాలయం కోరిన కోరికలు తీర్చే దేవాలయం గా గుర్తింపు
- రాతి కొండపై దేవాలయం నిర్మాణం
- వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాక
- జాతర ఏర్పాట్లుకు సర్వం సిద్ధం
- దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయ కాలంలో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర దేవాలయానికి ఎంతో విశిష్టత కలిగి ఉన్నదని దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దేవాలయం పడమర, నైరుతి తిరిగి ఉన్నటువంటి దేవాలయం రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు. ఆదివారం ఉదయం వేద న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు.ప్రతి ఏడాది పాల్గున మాసంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ దేవాలయానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని అన్నారు. భక్తుల సౌకర్యార్థం సర్వం సిద్ధం చేశామన్నారు.

స్థానిక ఎస్సై డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ పటిష్ట భద్రత నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజున అగ్నిగుండాలు ప్రవేశంతో జాతర పరిపూర్ణమవుతుందన్నారు. ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవాలయానికి ప్రాచీన చరిత్ర కలిగి ఉందన్నారు. రేచర్ల రెడ్డి రాజులకు,పద్మనాయక రాజులకు ఈ ఆమనగల్ గ్రామం ప్రసిద్ధిగాంచిందన్నారు.
ఆమనగల్ గ్రామాన్ని నాడు దోపిడి దొంగలను దురాగాతలను ఎదిరించి రేచర్ల చెవిరెడ్డి గ్రామాన్ని కాపాడాడని చెప్పారు. దీంతో కాకతీయ గణపతి దేవా చక్రవర్తి చెవిరెడ్డి బేతాళ నాయకుడు బిరుదు ఇచ్చి సత్కరించారని వివరించారు. కాకతీయ రాజులు ఆమనగల్లును రాజధానిగా చేసుకొని పిల్లలమర్రి పానగల్లు మిగతా దేవాలయాలని నిర్మించడం జరిగిందని తెలిపారు.

దేవాలయంలో నేటికీ బండపై చెక్కబడిన శాసనాలు కనిపిస్తున్నాయని అన్నారు. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగాన్ని గోధుమ పిండితో ప్రతిష్టించినట్లు చెప్పారు. నేటికీ గోధుమపిండితో తయారుచేసిన శివలింగానికి భక్తులు దర్శనాలు అందుతున్నాయన్నారు.