*ఎం సి పి ఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత*.

*యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని యూనివర్సిటీ భూములలో చేపట్టవద్దు*.

వేద న్యూస్, హన్మకొండ:
కాకతీయ యూనివర్సిటీ కి భవిష్యత్తులో చాలా రకాల కోర్సులు అందుబాటులోకి వస్తాయి వాటికీ అనుగుణంగా భవనాలు, విద్యార్థులకు సరిపడా హాస్టల్స్, నూతన ఆవిష్కరణల కోసం రీసెర్చ్ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు చాలా వరకు భూములు అవసరం పడతాయి కావున ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణం కోసం యూనివర్సిటీ పాలకమండలి 15 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భవిష్యత్తు యూనివర్సిటీ అవసరాల దృశ్య రెసిడెన్షియల్ స్కూల్ నీ ఇతర ప్రభుత్వ భూములలో నిర్మించాలన్నరు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున,డిఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పిడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఎస్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్, ఏఐడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ లతోపాటు విద్యార్థి సంఘ నాయకులు ఉప్పుల శివ, రాజు, చెట్టుపల్లి శివ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.