- మరిపెడ లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం
వేద న్యూస్, మరిపెడ:
అన్యాయాన్ని ఎదిరించటమే, అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమే కాళోజీ నారాయణరావు కి మనమిచ్చే నిజమైన నివాళి అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతరావు అన్నారు.
కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం పురస్కరించుకొని మరిపెడ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు సుధా, మంజుశ్రీ, విద్యార్థులకు పద్య పఠనం, వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, నృత్యం, తెలంగాణ కవి పరిచయాలు వివిధ అంశాలలో మంగళవారం పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ కార్యదర్శి బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం జనార్ధనా చారి, దేవుల, శ్రీశైలం, స్వప్న, ప్రకాష్, శౌరి, ప్రసాదరావు, సారయ్య జహెదా, సురేష్, బాబురావు, అనిత, రాజ కుమారి, పద్మ, శంకర్, సుజాత, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.