వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ అధికారులను కోరుతున్నారు. బాధితురాలు ఎల్.మమత తెలిపిన వివరాల ప్రకారం.. భూక్య రవి అనే వ్యక్తి తనతో పాటు చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఆర్థికంగా, మానసికంగా అన్ని విధాలుగా వారి జీవితాలతో ఆట ఆడుకున్నారని ఆరోపించారు.
తనకు 2021 ఆగస్టు 12న, మరు నాడు 13, 14, 15, 25 తేదీలలో అనేక సార్లు భూక్య రవి, రమేశ్‌లు ఫోన్ చేశారని, సమస్య పరిష్కరించుకుందామని సీపీఐ ఆఫీసుకు తనను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయ సారధి పిలిచారని తెలిపారు.
గత నాలుగేండ్లుగా పెండింగ్‌లోనే సమస్య ఉందని, తన జీవితాన్ని స్పాయిల్ చేశారని వెల్లడించారు. భూక్య రవి ఈ ఏడాది మే 21న వేరే వారిని పెళ్లి చేసుకున్నాడని తెలిపారు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి.. గత నాలుగేండ్లుగా ఇబ్బందులు పెడుతున్న భూక్య రవితో పాటు భూక్య రమేష్, విజయ సారథి, భూక్య రవి కుటుంబ సభులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు అధికారులను వేడుకున్నారు. గత నెల 23న మహబూబాబాద్ ఎస్పీకి ఈ విషయమై ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు మమత కోరుతున్నారు.